మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేసిన టి ఎన్ జి ఓ జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్
సిద్దిపేట జిల్లా ను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ సిద్దిపేట జిల్లా టి ఎన్ జి ఓ నాయకులు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించాడానికి వచ్చిన మంత్రి పొన్నం ను టి ఎన్ జి ఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి
విక్రమ్ రెడ్డి లు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయంలో అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి తీకెళ్తామని తెలియజేశారని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లా చార్మినార్ జోన్లో మెదక్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం వల్ల ఉద్యోగులు ప్రమోషన్లలో మిగతా విషయాలలో నష్టపోయారని 317 మీద ఉపసంఘం లో సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం సమర్పించడం అందించమని తెలిపారు. దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించడంతో పాటు వసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మార్పులు చేరుకున్న విషయంలో రాష్ట్రపతి దగ్గరికి పంపడం జరుగుతుందన్నారు.సాధ్యాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారని తెలిపారు.

దీనిద్వారా నిరుద్యోగులకు కూడా మంచి అవకాశం ఉంటుందని హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న సిద్ధిపేట జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం ఏరకంగా సహేతుకం కాదని అలాగే మల్టిజోన్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉద్యోగులు వెళ్లాల్సి రావడం జరిగిందని చార్మినార్ జోన్ లో కలపడం ద్వారా ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగ కలుగుతుందని మంత్రి వివరించమన్నారు.దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కూడా కోరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో సహాధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి కోశాధికారి అశ్వక్ అహ్మద్ సిద్దిపేట యూనిట్ అధ్యక్షులు మఠం శశిధర్ కార్యదర్శి పోతుల సత్యనారాయణ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఎన్ ఎం నాగేష్ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు