కేటీఆర్ రుణమాఫి పై చదువురాని దద్దమ్మల మాట్లాడుతున్నాడు..
కాంగ్రెస్ అభ్యర్థులు ఓడినా చోట కూడా అభివృద్ధి చేస్తున్నాం.. మంత్రి కొండ సురేఖ
కాంగ్రెస్ అభ్యర్థులు ఓడినా చోట కూడా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.శనివారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సానపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ
ఈ మండలంలో కోటి 10లక్షలతో నేడు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభం చేసుకుంటున్నామన్నారు.
హేమ హేమ నాయకులు ఉన్న ఈ జిల్లాకు తనని ఇన్చార్జి మంత్రి గా రేవంత్ రెడ్డి పంపారని తెలిపారు.
ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నచోట అభివృద్ధి చేస్తున్నాం
ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు.
బిఆర్ఎస్ అధికారం దిగిపోయేటప్పుడు లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లారు.వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నమన్నారు.గత ప్రభుత్వంలో చేసిన పనులకే బిల్లులు ఇవ్వలేదు గత నాయకులు కాంట్రాక్టర్ల ల నుండి కోట్ల రూపాయల పర్సంటేజ్ లు తీసుకున్నారని ఆరోపించారు.మేము ఇచ్చిన హామీ లు నేరేవేర్చే బాధ్యత తమ పై ఉంది మీరు మంచిగా అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ప్రజలు మూడవసారి గెలిపించేవాళ్ళు గత ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలి.సాగుకు యోగ్యమైన భూమి కి రైతు భరోసా ఇస్తున్నాం.రుణమాఫి పై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.కేటీఆర్ రుణమాఫి పై చదువురాని దద్దమ్మల మాట్లాడుతున్నాడు రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి అందిస్తాం.ప్రతి నియోజక వర్గానికి 3500ఇండ్లు మంజూరు చేస్తున్నాం సోషల్ మీడియా కి బిఆర్ఎస్ డబ్బులు చెల్లించి రేవంత్ రెడ్డి పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో నెరవేర్చనీ హామీ లు చేతడంత ఉంటుంది మేము ఇప్పటికే యాభై శాతం హామీలు అమలు చేశాం.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ లను గెలిపించండి మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి.
