Th9news (తెలంగాణ హెడ్ లైన్) జనవరి 19 సిద్దిపేట:
కాళేశ్వరం కోసం రాత్రి పగలు కష్టపడ్డారు.
కేసీఆర్. హరీశ్ రావులు
కాళేశ్వరం పై అబద్దాలు చెప్పి ఇప్పుడు అదే కాళేశ్వరం నుండి రైతులకు నీటిని వదులుతున్నారని సూడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో పార్టీ సీనియర్ నాయకులు వంగ నాగిరెడ్డి, అల్లం ఎల్లం, మండల పార్టీ అధ్యక్షులు ఎర్ర యాదయ్య, ఎద్దు యాదగిరి, మోహన్ రెడ్డి, హంస కేతన్, అల్లం కిషన్ లతో కలసి మీడియా సమావేశం లో మాట్లాడారు. ఇప్పటికైనా కొండ సురేఖ మంత్రి హోదాలో నీరు వదలడం సంతోషం అన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని మీరే ఒప్పు కోవడం కూడా సంతోషంగా ఉందన్నారు.ఈరోజు మీరు రెండు సార్లు నీరు వీడిచారు. ప్రభుత్వం రాక ముందు ప్రాజెక్టుల మీద మీరు అనేక విమర్శలు చేశారు కాళేశ్వరం మీద చాలా అబద్ధాలు చెప్పారు ఒక్క ఎకరాకు నీరు రాదని, కుంగి పోయిందని,కాళేశ్వరం దండుగ అని, కమీషన్ల కోసమే అని ఇష్టం వచ్చినట్లు మీరు. మీ నాయకులు అన్నారు. ఇప్పుడు నీరు వదిలడానికి పోటీ పడి ఫొటోలు దిగారని ఏద్దేవ చేశారు.కేసీఆర్, హరీష్ రావు ల కృషి వల్ల ప్రాజెక్టులు పూర్తి అయ్యాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమి సేకరణ చేశారు. ఒక్క ఎకరకు నీరు ఇవ్వలేదు అని బట్టి..మీరు లక్ష ఎకరాలకు నీరు అని ప్రకటన ఏది వాస్తవం మీరు పొంతన లేని మాటలు ఎందుకని ప్రశ్నించారు.హైదరాబాద్ కు నీరు ఎక్కడి నుంచి వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి సీఎం ఆలోచన ఉంది. వృధా ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ వాసులకు ఎలా నీరు తీసుక పోతారు.ఏ ముఖం పెట్టుకుని వచ్చి నీరు విడుదల చేశారనానరు. కేసీఆర్ హరిశ్ రావు లను లను విమర్శిస్తే సహించేది లేదని హేచ్చరించ్చారు.అసలైన రైతులకు భరోసా ఇవ్వలేని దుస్థితి లో కాంగ్రెస్ ఉందన్నారు. రేవంత్ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని తిరిగి అదృష్టం కొద్దీ ఇప్పుడు సీఎం అయ్యారని అన్నారు.ఇప్పటికైనా కేసీఆర్, హరీశ్ రావు లను విమర్శించడం మానుకో లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.