–దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్
–జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు కమలాకర్
దుబ్బాక:జనవరి19,(TH9 NEWS తెలంగాణ హెడ్ లైన్)
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ,శనివారం రోజున దుబ్బాక నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ కార్యక్రమాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పేరుతో చిల్లర రాజకీయాలు చేయడం, దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో పార్టీకి సంబంధించిన వ్యక్తులను వేదిక పైన కూర్చోబెట్టి, కొబ్బరికాయలు కొట్టిచ్చిన చరిత్ర ఇక్కడి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు తీరు దయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉన్నదని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండగా దుబ్బాక నియోజకవర్గంను అన్ని రకాల అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.తన నియోజకవర్గం సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నారని తెలియజేశారు. ఒక దశలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గలు నాకు రెండు కళ్ళు అని చెప్పిన హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గం కన్నును పొడిచి, సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నది నిజం కాదా ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దుబ్బాక ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సజావుగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు,మాయ నుండి బయటకు రావాలని తెలిపారు.దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సహకరించాలని తెలిపారు. మీరు ఇదే విధంగా అభివృద్ధిని అడ్డుకుంటే దుబ్బాక మరింత వెనుక పడుతుందని ఇక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించారని మీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేరు అభివృద్ధి చేస్తానని ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీని,చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని అడ్డుకోవడం ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడి తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, మండల యూత్ అధ్యక్షులు అబ్బుల లోకేష్ గౌడ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుద్ధోజి ప్రభాకర్ చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, ఉత్తం నరేష్, షేర్ పల్లి స్వామి, కూతురి చందు, వెలుపుల యాదగిరి ముదిరాజ్, దేవర మైపాల్ యాదవ్, జీడిపల్లి రమేష్, బోరేడి హనుమంత రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.