జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట: జనవరి 21(తెలంగాణ హెడ్ లైన్)
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన జాతీయ సదస్సు లో బక్రి చెప్యాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ సంధాని దిగ్విజయంగా పాల్గొని జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని న్యూ ఢిల్లీ వరకు తీసుకు పోవడం అభినందనీయమని జిల్లా విద్యా శాకాధికారి ఎల్లెంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బక్రిచెప్యాల పాఠశాల స్థాయిని జాతీయ సదస్సులో ప్రెసెంటేషన్ చేయడం గొప్ప విషయమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి ప్రశంసించారు. తన విద్యా బోధన పద్ధతులను జాతీయ స్థాయి కి తీసుకు వెళ్లడం అభినందనీయమని పి ఆర్ టీ యు అసోసియేట్ అధ్యక్షుడు ఆశ లక్ష్మణ్ అన్నారు. అనంతరం సయ్యద్ సంధానిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జనార్ధన్, రంగానాధం, దారం నాగేందర్ రెడ్డి, యండి యూసుఫ్, విష్ణుర్ధన్, ప్రశాంత్, పకాల రాజయ్య, జీసీడి ముక్తేశ్వరి పాల్గొని సయ్యద్ ను అభినందించారు.
