– అయోధ్య శ్రీ రాముని ప్రతిష్ట రోజున సిద్దిపేట లో కళ్యాణం జరగడం సంతోషంగా ఉంది
– సిద్దిపేట లో శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యానోత్సవం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట జిల్లా, జనవరి 22 (TH9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్డు లో గల హనుమాన్ దేవాలయం లో జరిగిన శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యానోత్సవం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. శ్రీరాముని కళ్యాణం వైభవంగా నిర్వహించారని, ఈరోజు గొప్ప సుదీనం అయోధ్య శ్రీ బాలరాముని ప్రతిష్ట జరిగిన రోజు మన సిద్దిపేట లో శ్రీరాముని కళ్యాణం జరగడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఎంతో పుణ్యం గా భావిస్తున్ననన్నారు. శ్రీ రాముని కృప తో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముని దయ దీవెన మన అందరి ఫై ఉండాలని సీతా రామచంద్ర స్వామి ని వేడుకున్నారు. గొప్ప గా అంగరంగ వైభవంగా కళ్యానోత్సవం నిర్వహించిన నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, కౌన్సిలర్ దీప్తి నాగరాజు, గరిపల్లి లక్ష్మి నాథం , గోపిశెట్టి శరభయ్య, ఇరుకుల శేఖర్, బస్సు మహేష్, నాగేందర్,
శ్రీకాంత్, లక్ష్మణ్ కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

