Thursday, March 13, 2025
HomeNewsపది సంవత్సరాల లో చేయలేని పని సంవత్సరంలో చేసి చూపిస్తున్నాం

పది సంవత్సరాల లో చేయలేని పని సంవత్సరంలో చేసి చూపిస్తున్నాం

-అరులైన వారికి అన్ని పథకాలు అందిస్తాం

-సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట జిల్లా, జనవరి 22(TH9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
10 సంవత్సరాలలో పేద ప్రజలకు రేషన్ కార్డులు డబుల్ బెడ్ రూమ్ లు అందిస్తామని చెప్పి ప్రజలను మోసగించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని మీరు 10 సంవత్సరాలలో చేయలేని పనిని సంవత్సర కాలంలో చేసి చూపిస్తుంటే ప్రభుత్వానిపై బురదజల్లే పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ  ఆత్మీయ భరోసా అన్ని పథకాలు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేస్తుంటే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పై సానుభూతి వస్తుందని బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అధికారం పోయినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పై అప్రతిష్ట పాలు చేయడానికి బిఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు అందకుండా వారిని తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని అన్నారు. గతంలో పూజల వెంకటేశ్వరరావుకు రేషన్ కార్డు ఉండడంతోనే అధికారులు సిబ్బంది లిస్టులో పేరు చేర్చి ఉంటారని అన్నారు. ప్రెస్ విలేకరుల ముందు అధికారులను బెదిరిస్తే గాని లిస్ట్ ఇవ్వలేదని బహిరంగంగా చెప్పిన పూజల వెంకటేశ్వరరావు పై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేయాలని అన్నారు. రేషన్ కార్డు విషయంలో అధికారుల సిబ్బంది తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అరువులకు అందకుండా తప్పుదోవ పట్టించడానికి కొందరు బిఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. పది సంవత్సరాలలో రేషన్ కార్డులు మీరు ఒక్కరికి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో లక్షల మందికి అర్హులైన వారికి డబ్బులు బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి గజ్వేల్ సిద్దిపేట ఎక్కడ కూడా సరిగా ఇవ్వలేదని అర్హులకు కాకుండా బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చారని అన్నారు. మీలాగా అబద్ధాల ప్రభుత్వం మాది కాదని ఇచ్చిన మాట వేనకకు తగ్గని కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేముందు కౌన్సిలర్ బ్రహ్మం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కౌన్సిలర్ బ్రహ్మం కు లేదని అన్నారు. బ్రహ్మం నోరు తెరిస్తే అబద్ధమే మాట్లాడుతాడని ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందని అన్నారు. మరోసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే జాగ్రత్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కేదారి మధు యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు సలీం ఫయాజ్ ఫయాజుద్దీన్ రఘు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!