– దాడికి పాల్పడినవారిని శిక్షించాలి
– T U WJ జిల్లా అధ్యక్షుడు రంగాచారి
సిద్దిపేట: ఫిబ్రవరి 16(TH9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
జర్నలిస్టులపై దాడులను ఉపేక్షించబోమని, జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టియుడబ్ల్యూజే (ఐజేయూ) డిమాండ్ చేసింది. ఆదివారం రోజున సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో సీనియర్ జర్నలిస్టు పరమేశ్వర్ పై జరిగిన దాడిని యూనియన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో జిల్లా అధ్యక్షులు రంగాచారి స్పష్టం చేశారు. దాడి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసామని, ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. పరమేశ్వర్ పై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నాయిని సంజీవరెడ్డి, రంగదాంపల్లి శ్రీను,మల్లారెడ్డి , యాదగిరి గౌడ్. దాయనందు, ఇంద్ర శేఖర్ ,సాయి గౌడ్, నరేష్,సంతోష్, చందు,శ్రీకాంత్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు