అందుబాటులో ఆటో బైక్ రాపిడో సదుపాయం
మొదటి రైడ్ ఉచితం
సిద్దిపేట: ఫిబ్రవరి 18(TH9NEWS,తెలంగాణ హెడ్ లైన్)
సిద్దిపేటలో ఆటో, బైక్ రాపిడో సేవలను అందిస్తున్నట్లు ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని సిద్దిపేట రాపిడో మేనేజర్ రాజేష్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద రాపిడో క్యాపిటల్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో సులభ ప్రయాణం కోసం రాపిడో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ రాపిడో యాప్ డౌన్లోడ్ చేసి సురక్షిత ప్రయాణాన్ని పొందాలని తెలిపారు. ఫ్లెక్సీలు, వాల్ స్టిక్కర్స్, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రాపిడోలో ఎలాంటి సమస్య తలెత్తిన తన దృష్టికి తీసుకురావాలని రాపిడో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాపిడో క్యాపిటన్స్ తదితరులు పాల్గొన్నారు.
