Thursday, March 13, 2025
HomeNewsకష్టాల్లో, అపదలో ఉన్నవారిని ఆదుకుంటేనే నిజమైన సార్ధకత

కష్టాల్లో, అపదలో ఉన్నవారిని ఆదుకుంటేనే నిజమైన సార్ధకత

CPM అనుబంధ కార్మిక, కర్షక భవనాన్ని ప్రారంభించిన

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి, వి రాఘవులు

సిద్దిపేట: జనవరి 20 (Th9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
కష్టాల్లో, అపదలో ఉన్నవారిని ఆదుకుంటేనే నిజమైన సార్ధకత అని  సీపిఎం రాష్ట్ర కార్యదర్శి బి, వి రాఘవులు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లో నూతనంగా నిర్మించిన కార్మిక, కర్షక భవన ప్రాంభోత్సవానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ
సిద్దిపేట జిల్లా సమస్యలపై  ఇంకా పోరాటం చేయడానికి భవనం అనుకూలంగా ఉంధన్నారు. కార్యకలయాలు నిర్మిస్తే సరిపోదు కష్టాల్లో, బాధలో ఉన్న,వివిధ రకాల సమస్యలు పైన వచ్చే బాధితులు వినోయోగపడే విదంగా ఉండాలన్నారు.కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చాయి, అవి వచ్చే ఏప్రిల్ తరువాత అమలు  కాకుండా చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను కోరుకుంటున్న  ఈ ప్రభుత్వం కొత్త చట్టాలు అమలు కాకుండా చూడాలన్నారు.మోడీ కొత్త నాటకం మొదలు పెట్టారు,3 కొత్త నల్ల చట్టాలు తెచ్చారు, అందుకే రైతులు ఢిల్లీ నించుట్టు ముట్టారు.మోడీ ప్రభుత్వం అదాని, అంబానీ లాంటి పెద్దలకు గ్రీన్ కార్పెట్ వేస్తుందని మండిపడ్డారు.ప్రభుత్వం మనకు గిట్టుబాటు ధర ఇవ్వక పోతే కోర్ట్ ఐనా పోవాలి.పేదల భూములు, పెద్దలు కొనడానికి భూమి కార్డులు తెసుతున్నారు, అందుకే వాటిని వ్యతిరేకించాలి.విద్య ప్రయివేట్ పరం ఉండకుండా, ప్రభుత్వం ఉచిత విద్యను అమలు అయ్యే విదంగా పోరాడాలని పిలుపునిచ్చారు.అంగన్వాడీ ని ఇస్కాన్ కు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుంది,

వాటిని వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
మోడీ ఒకే ఎన్నిక, ఒకే దేశం చేయాలని చూస్తున్నారు ఇది అమలు ఐతే కేసీఆర్, చంద్రబాబు, జగన్, స్టాలిన్ లు దుకాణాలు ఎత్తేస్తారు ,ఎందుకు అంటే కేంద్రం అజమశి చేస్తుంది.డబ్బులు ఉన్న వాళ్ళుల్లే ఎన్నికల్లో  గెలుస్తారు.ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కానున్నాయని తెలిపారు.ఈ కార్యక్రంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి గోపాల స్వామి సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

https://twitter.com/th9news/status/1881256807450251601?t=iBBJlASgrwqkLzoe_iBkug&s=19
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!