సిద్దిపేట లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కంది కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

కందుల మద్దతు ధర రూ 7550 నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకే కందులను అమ్ముకోవాలని తెలిపారు. వడ్లకు 48 గంటల్లో పేమెంట్ చేయడం జరిగిందని,
సన్న వడ్లకు రూ 500 బోనస్ ఇచ్చామన్నారు.వ్యవసాయ భూముల అన్నిట్లకు రైతు భరోసా, జనవరి 26 నుంచి అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు అన్నారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.
