Sunday, March 9, 2025
HomeTelanganaSiddipetఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలి..హరీష్ రావు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలి..హరీష్ రావు




*గుంట భూమీ ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.*

*రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,5700 మంది ఉన్నారు.*

*కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి.*

*నియోజకవర్గానికి 3500 ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారు ?*

*గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలి.*

*గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలి.*

………………………………………………….

*వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.*



*సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్:*

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి.

రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు.

వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు.

రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు.

గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరం.

ఒక్క సెంటు భూమి ఉన్నా కూలి కాదు అని చెబుతున్నది.

ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదు.

.

నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. కానీ లబ్ధిదారుల ఎంపిక  విధివిధానాలు విడుదల చేయలేదు.

సిద్దిపేట జిల్లాలో 68 వేల దరఖాస్తులు వచ్చాయి.

డోర్ టు డోర్ సర్వేలో మిగిలిన ఇళ్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫైనల్ చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి.

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేది.

అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలి.

గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై అయిన వారు  కొంత నిర్మించుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం.

అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి.

అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్ళని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి.

ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారు.

ముఖ్యంగా దళితులు, గిరిజనులు.. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తాయి.

5 గుంటలో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయం.

రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది 1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలు.

రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు  24 లక్షల 57,000 మంది  ఉన్నారు.

గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే 12,000 నష్టపోతారు కాబట్టి. ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలి.

ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!