సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఎన్టీఆర్ 29 వర్ధంతి సందర్భంగా టిడిపి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..అనంతరం పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీ రామారావు చేసిన కృషి మరువలేనిదన్నారు.ఆయన స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాలో టిడిపిని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామన్నారు.ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ మెంబర్ గుడిమల్ల సత్తయ్య అన్నారు.రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల మన్ననలు పొందిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాటికొండ రమేష్, వెంకటేశ్వర్లు, సత్య గౌడ్, పలువురు పాల్గొన్నారు..