సిద్దిపేట, జనవరి 16:
మాట తప్పని మడప తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పదేళ్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేస్తుందని కౌన్సిలర్లు సాకి బాలలక్ష్మి ఆనంద్, రియాజుద్దీన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలు పెట్టినందుకుగాను సిద్దిపేట మున్సిపల్ పరిధి 37వ వార్డులో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నేటితో వారి ఇబ్బందులు తొలగినట్లేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి రేషన్ కార్డులు మంజూరు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జనవరి 26 నుండి రైతు భరోసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, శ్రీకాంత్, స్రవంతి, రజిని పలువురు పాల్గొన్నారు.