26వ వార్డు కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్
సిద్దిపేట: ఫిబ్రవరి 13 (Th9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందిస్తున్నపుడే మనుసు నిజమైన సంతృప్తి చేందుతునని కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణ 26వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన సారగు వసంత యాదగిరి దంపతుల కుమార్తె రేఖ వివాహనికి కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ చేయుతనిచ్చారు. 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదవారు కష్టాల్లో ఉంటే అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పేదింటి బిడ్డ పెండ్లికి చేయూత నివ్వడం అంటే సేవ చేసే భాగ్యం కలిగినట్లు అన్నారు.