ప్రోటోకాల్ విషయం లో తప్పులు జరుగకుండా చూస్తాం
మంత్రి కొండా సురేఖ
సిద్దిపేట జిల్లా :
ప్రోటోకాల్ విషయం లో తప్పులు జరుగకుండా చూస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నేడు రంగనాయక సాగర్ నుండి నీటిని విడుదల చేసి రైతులకు శుభవార్త అందిస్తున్నామన్నారు.ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 2.44టిఎంసి నీళ్లు ఉన్నాయని ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా
42వేల ఎకరాలకు సాగునీరు అందుతుంధన్నారు.
రైతులకు 1.10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ప్రోటోకాల్ విషయంలో గత నాయకులు ప్రోటోకాల్ పాటించలేదు ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.మళ్ళీ ఎప్పుడు ప్రోటోకాల్ విషయంలో గొడవ తలెత్తకుండా చూస్తామని అన్నారు.