రంగదాంపల్లి ఎంపీపీఎస్ పాఠశాల లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు
సిద్దిపేట: ఫిబ్రవరి17(TH9NEWS తెలంగాణ హెడ్ లైన్)
విద్యార్థులు ఉపాద్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నత విలువలు క్రమశిక్షణ విలువలు పాఠశాలలొనే పిల్లలు అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు పరమేశ్వరి తెలిపారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం లోని రంగదాంపల్లి ఎంపీపీ ఎస్ పాఠశాల లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవం అనేది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారడం వలన ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనం తెలుస్తుందని అలా సమాజంలో బాధ్యతాయుతంగా ఉన్నతస్థానంలో స్థిరపడతారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, పద్మ, కనకరాజ్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..