ఈనెల 19న సిద్దిపేట పట్టణంలో శివాజీ జయంతి ఉత్సవాలు బైక్ ర్యాలీ
సిద్దిపేట:17ఫిబ్రవరి(TH9NEWS తెలంగాణ హెడ్ లైన్)
ఈనెల 19న శివాజీ జయంతి ఉత్సవాలు జరుగుతాయని
రాష్ట్ర సంపర్కసహసంయోజక్ భూమి రెడ్డి తెలిపారు.
సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో హిందువాహిని ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో పాశ్చాత్య సంస్కృతి తాండవం చేస్తుంది యువత విదేశీ కల్చర్ లో భాగంగా మత్తు మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు అద్భుతంగా ఉండేవి రానురాను కుటుంబ సాంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి యువత దేశ జాతీయ నాయకుల, పురాణ పురుషుల యొక్క చరిత్ర, త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ పేర్కొన్నారు. శివాజీ తల్లి జిజియా మాతా తన కొడుకును ధర్మం వైపు దేశ రక్షణ వైపు అడుగులు వేయించి ఈ దేశాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడే విధంగా తయారుచేసిందని చెప్పారు. అదేవిధంగా ప్రతి తల్లి తన పిల్లలకు కుటుంబ విలువలు మన సంస్కృతి సాంప్రదాయం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల 19న సిద్దిపేట పట్టణంలో శివాజీ జయంతి ఉత్సవాలు బైక్ ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెలిపారు. కాబట్టి ఇది మనందరి పండుగగా భావించి ఈ ధర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తలుగా అప్పల ప్రసాద్, కమలానంద భారతి వస్తున్నారనీ, వారు ఇచ్చే అమూల్యమైన ప్రసంగాలు విని దేశాన్ని ధర్మాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా సంయోజక్ బస్వరాజు సత్యం, బండికిరణ్, లక్ష్మణ్ , సందీప్, కిరణ్, శివారెడ్డి, ప్రదీప్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.