సిద్దిపేట జనవరి18:TH9NEWS
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది నిండిన సందర్భంగా సిద్దిపేటలో వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గరిపల్లి లక్ష్మీ నాథం తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్డు శివం కాంప్లెక్స్ ఎదురుగా ఈనెల 22న అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవంలో భాగంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణంలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో గోపిశెట్టి శరభయ్య, ఇరుకుల శేఖర్, బస్సు మహేష్, కొత్తూరు నాగేందర్, మద్ది శ్రీకాంత్, గరిపల్లి లక్ష్మణ్ కుమార్, సింహాచలం వినయ్ పాల్గొన్నారు పాల్గొన్నారు.