సిద్దిపేట జిల్లా,జనవరి 22(TH9NEWS తెలంగాణ హెడ్ లైన్)
అయోధ్య బాలరాముడి ప్రతిష్టా మహోత్సవ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నంగునూరు మండల పరిధిలోని అక్కెనపల్లి గ్రామంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అక్కెనపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. హనుమాన్ ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం లో పలువురు దంపతులు పాల్గొని స్వామి వారికి ఓడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటయ్య, రామచంద్రం, ఇంద్రసేనారెడ్డి, మల్లయ్య, శివ, మహిళలు పాల్గొన్నారు.
