దుబ్బాక:జనవరి19,(TH9 NEWS తెలంగాణ హెడ్ లైన్)
మరిచిపోతున్న బంధాలను ఒక్కటి చేయాలని,
కనుమరుగవుతున్న చిన్ననాటి మిత్రుల
తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను,
చేరువవుతున్న వృద్దాప్యంలో నెమరు వేసుకోవాలని,
ఆత్మీయతతో ఆనందముగా మన ముందున్న రోజులను
గడపాలని, అమెరికాలో వుంటున్న మిత్రులు కొండ శ్రీనివాస్
ZPHS DBK 1978-79 పేరుతో అక్టోబర్ 11-2019లో
వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసిన వేళా విశేషమో మరేమిటో తెలియదు కాని, ఇప్పుడు 46 యేళ్ళకిందటి ఎన్నొ జ్ఞాపకాలను ఈ వేదికపై పంచుకుంటున్నారు.కలవరిక ఎప్పుడూ అనుకున్న మన చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. పుట్టిన ప్రతి మనిషి జీవితమూ పూలపాన్పు కాదు.అలాగని కష్టాలు కడవరకూ ఉండవు.కష్టాలూ కన్నీళ్లు, సుఖాలు దు:ఖాలు ఎప్పుడో ఒకప్పుడు మనుషులుగా పుట్టిన మనల్ని తప్పక స్పృషిస్తాయి. తట్టుకునే ధైర్యము,అప్పుడప్పుడు కోల్పోతుంటాము. సంతోషానికి పొంగిపోక దు:ఖానికి కృంగిపోక నిలిచిన నాడే మనం, మనకు మిగిలిన కాలంలో మనగలము.కాలంతో పాటుగా నడువగలము. దొర్లిపోతున్న కాలం దొరలా వెల్లిపోతుంది. మరలి రానంటూ మిత్రులెందరో మనల్ని వదిలి కనుమరుగవుతున్నారు.మరణించిన 14 మంది మిత్రులను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.స్నేహానికన్న మిన్న వేరేది లేదులే అను పుస్తకమును ఆవిష్కరించుకున్నారు.చదువుకున్నప్పటి జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకురావడమనేది చాలా గొప్ప విషయమని చాలా మంది కొనియాడారు.. పుస్తకం రూపకల్పన చేసిన మచ్చ రాజమౌళి ని హాజరయిన మిత్రులు అభినందించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన కొండ శ్రీనివాస్, అంజనేయులు, రామస్వామి, రాంమోహనాచారి, అనిల్ లకు ధన్యవాదములు తెలిపారు.
కాలేజ్ ప్రిన్సిపాల్ జమాల్ గారు హాజరయి ఈ పూర్వ విద్యార్థుల కలయిక ను చూసి ఎంతో సంతోషించారు.ఈ కార్యక్రమంలో 78-79 SSC Batch విద్యార్థుల కలయిక లో 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బస్టాండ్ నుండి స్కూల్ వరకు బ్యానర్ పట్టుకొని పాదయాత్ర చేశారు. నగరంలోని వారు వీరి ఐక్యతను చాలా మంది మెచ్చుకున్నారు.ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలనుకున్నారు.